ద్వీపానికి సొబగులు | - | Sakshi
Sakshi News home page

ద్వీపానికి సొబగులు

Aug 24 2025 12:01 PM | Updated on Aug 24 2025 12:01 PM

ద్వీప

ద్వీపానికి సొబగులు

ఏడాదిలోనే పనులు పూర్తి..

ఈగలపెంటలో రివర్‌ క్రూయిజ్‌..

అమరగిరి ద్వీపంలో పర్యాటకులకు సకల వసతులు

వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్ట్‌తో పర్యాటకుల ఆకర్షణ

రూ.68.10 కోట్ల అంచనాతో పనులు

నల్లమల అడవి, కృష్ణానది అందాలను ఆస్వాదించేలా రూపకల్పన

అమరగిరి ఐలాండ్‌లో టూరిజం వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా పర్యాటకులకు అధునాతన వసతులను కల్పించనున్నాం. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో సందర్శకులకు ఈ ప్రాంతం మంచి డెస్టినేషన్‌ అవుతుంది. టూరిజం అభివృద్ధి ద్వారా కొల్లాపూర్‌ ప్రాంత రూపురేఖలు మారుతాయి. కేవలం ఏడాది కాలంలోనే పనులను పూర్తి చేస్తాం.

– జూపల్లి కృష్ణారావు, మంత్రి

అమరగిరి ఐలాండ్‌ వెల్‌నెస్‌ రిట్రీట్‌ ప్రాజెక్ట్‌ వ్యయం

రూ. 45.84 కోట్లు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: చుట్టూ పచ్చగా కళకళలాడుతున్న నల్లమల కొండలు, మధ్యలో నుంచి నీలిరంగు పులుముకొని పరవళ్లు తొక్కుతూ సాగిపోయే కృష్ణమ్మ.. ఆ నది మధ్యలో ప్రకృతి ప్రేమికులు సేద దీరేందుకే ఆశ్రయం ఇచ్చిందా అన్నట్టుగా ఉన్న దీవి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని కృష్ణానది తీరంలోని అమరగిరి ద్వీపంలో పర్యాటకుల కోసం సకల వసతులు ఏర్పాటు చేయనున్నారు. రూ.68.10 కోట్ల వ్యయ అంచనాతో ప్రభుత్వం వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్ట్‌ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఒకేచోట పర్యావరణం, అడవులు, ఆధ్యాత్మికత, రీక్రియోషన్‌, వెల్‌నెస్‌, వాటర్‌స్పోర్ట్స్‌ అందుబాటులో ఉండేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు.

పర్యాటకం, ఆధ్యాత్మికం ఒకేచోట..

పర్యాటకంగా విస్త్రృత అవకాశాలు ఉన్న కృష్ణాతీరంలోని అమరగిరి ద్వీపంలో సమీపంలో పురాతన ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్‌ టూరిజంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు ఆరోగ్యం, ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(సాస్కి) స్కీమ్‌ కింద నిధులను వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అమరగిరి సమీపంలో కృష్ణానదిలో ఉన్న సుమారు 8 ఎకరాల ద్వీపంలో వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్ట్‌ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ ద్వీపంలో పర్యాటకుల వసతి కోసం రూ.45.84 కోట్ల వ్యయంతో 30 వరకు కాటేజీల నిర్మాణం, కెఫెటేరియా, యోగా డెస్క్‌, స్పా సెంటర్‌, ఇన్‌డోర్‌ గేమ్స్‌, స్విమ్మింగ్‌పూల్‌, ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌, వాచ్‌టవర్‌, వ్యూ పాయింట్‌, జెట్టీబోట్స్‌, ధ్యాన మందిరం సౌకర్యాలను కల్పించనున్నారు. పర్యాటకులు ఒకసారి ద్వీపంలో ప్రవేశించాక అధ్యాత్మిక, పర్యా

టక అనుభూతులను ఒకేచోట ఆస్వాదించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. కృష్ణాతీరంలోని సోమశిలలో వీఐపీ ఘాట్‌ వద్ద బోటింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయనున్నారు. కొల్లాపూర్‌ మండలంలోని లలితా సోమేశ్వర ఆలయం, జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాలకు అనుసంధానిస్తూ టెంపుల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు.

సోమశిల

వీఐపీ ఘాట్‌ –

రూ.1.60 కోట్లు

సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం

రూ.68.10 కోట్లు

ఈగలపెంట

అరైవల్‌ జోన్‌, ప్రోమోనోడ్‌ రూ.8.36 కోట్లు

ఈగలపెంట

రివర్‌ క్రూయిజ్‌

నోడ్‌ –

రూ.7.69 కోట్లు

అమరగిరి వద్ద కృష్ణానదిలో ఉన్న ద్వీపం

ఈగలపెంట

చెంచు

మ్యూజియం – రూ.3.60 కోట్లు

అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌లో ఈగలపెంట రివర్‌ క్రూయిజ్‌ నోడ్‌ కింద పనులు చేపట్టనున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించేలా రూఫ్‌ టాప్‌ కేఫ్‌ నిర్మాణం, వ్యూయింగ్‌ డెక్‌, ల్యాండ్‌స్కేపింగ్‌ గార్డెన్‌, గోల్ఫ్‌ కార్ట్‌, లైటింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేపట్టనున్నారు. ఈగలపెంటలోనే చెంచు మ్యూజియం నిర్మాణం ద్వారా స్థానిక చెంచుల జీవన స్థితిగతులపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తారు. ఈ సర్క్యూట్‌ పరిధిలో పర్యాటకుల కోసం వసతులు, పార్కింగ్‌, రోడ్డు సౌకర్యాలను విస్త్రృతం చేయనున్నారు.

ద్వీపానికి సొబగులు 1
1/4

ద్వీపానికి సొబగులు

ద్వీపానికి సొబగులు 2
2/4

ద్వీపానికి సొబగులు

ద్వీపానికి సొబగులు 3
3/4

ద్వీపానికి సొబగులు

ద్వీపానికి సొబగులు 4
4/4

ద్వీపానికి సొబగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement