
కొండ్రావుపల్లెతో ప్రత్యేక అనుబంధం
సాక్షి, నాగర్‌కర్నూల్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి మరణంతో నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లెలో విషాదం నెలకొంది. సురవరం సుధాకర్‌రెడ్డి అమ్మమ్మ ఊరు అయిన కొండ్రావుపల్లెలోనే 1942 మార్చి 25న జన్మించారు. గ్రామంలోని వద్ది రాంరెడ్డి మనవడిగా సుధాకర్‌రెడ్డి గ్రామస్తులకు సుపరిచితుడు. బాల్యంలో ఎక్కువ సమయం పాటు కొండ్రావుపల్లెలోనే గడిపేవాడు. ఎంపీగా, జాతీయ స్థాయి కమ్యూనిస్టు అగ్రనేతగా ఎదిగినా తనకు సమయం కుదిరినప్పుడల్లా కొండ్రావుపల్లెకు వచ్చి బంధువులతో ఆత్మీయంగా గడిపేవాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు.
●