
‘ఆధార్ ఆధారిత హాజరు సరికాదు’
కందనూలు: ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ దేవ సహాయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ నాయకులు మాట్లాడుతూ.. ఆధార్ ఆధారిత హాజరు ద్వారానే వేతనాలు చెల్లించనున్నట్లు వివిధ పత్రికల్లో రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.