
సీపీఎస్‌ను రద్దు చేయాలి
కందనూలు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వచ్చే నెల 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశనిపాతంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను సమూలంగా రూపుమాపడానికి పీఆర్టీయూ టీఎస్ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా చేపట్టనున్న మహాదర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బావండ్ల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరావు, పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యదర్శి సురేందర్‌రెడ్డి, నాయకులు బిచ్చానాయక్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోండి
కొల్లాపూర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చివరి విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కొల్లాపూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99899 45177 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలనుకునే యువత, మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలిగేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఈపథకం ద్వారా బ్యాంకు రుణాలతో పాటు కేంద్ర నిధుల నుంచి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయని, ప్రస్తుతం పునరుద్ధరించబడినందున ఆసక్తి గల అభ్యర్థులు https://www.kviconline.gov.in/pmegpeotal ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు.