
పాత ఇళ్లలో ఉంటే ప్రమాదమే..
భారీ వర్షాల నేపథ్యంలో రోజుల తరబడి తడిసి ఉన్న మట్టి మిద్దెలు, పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఙప్తి చేస్తున్నారు. గతేడాది జూలైలో జిల్లాకేంద్రం సమీపంలోని వనపట్లలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటికే అమ్రాబాద్ మండలం జంగిరెడ్డిపల్లిలో నాలుగు, పెద్దకొత్తపల్లి మండలం దేవునేనిపల్లి గ్రామంలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా కూలింది.