లక్ష్యం @ 25 లక్షలు
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం (హరితహారం) కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ పర్యాయం కూడా జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 21 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం చేపడుతుంది. దీనిలో భాగంగా జూలై మొదటి వారంలో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, అంగన్‌వాడీ, బీడు, బంజరు భూములు, రోడ్డుకిరువైపులా, పొలాల గట్లపై మొక్కలు నాటాలని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ మొక్కలకు ప్రాధాన్యం..
వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు పది కాలల పాటు నిలిచి ఉండాలనే లక్ష్యంతో పదో విడత వన మహోత్సవంలో అధికారులు ప్రత్యేకించి కొన్ని జాతుల మొక్కలను ఎంపిక చేశారు. ప్రధానంగా వీటినే నాటించాలని నిర్ణయించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పండ్ల చెట్లను నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు వేప, రాాగి, మేడి, మర్రి, నేరేడు, కానుగ, కదంబ, గుల్‌మోర్, కరివేపాకు, మునగ, బొప్పాయి, ఈతతోపాటు పలు రకాలు పండ్లు, పూలు, ఔషధ మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా మొక్కలు సుదీర్ఘకాలం మనగలగడమే కాక.. ఇతరత్రా ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువ శాతం ఈ రకం మొక్కలనే వన మహోత్సవం కోసం సిద్ధం చేస్తున్నారు.
పదో విడత వనమహోత్సవానికిఅధికారుల సన్నద్ధం
జిల్లావ్యాప్తంగా
అన్ని పంచాయతీల్లో మొక్కల పెంపకం
పండ్లు, ఔషధ మొక్కల
పెంపకానికి ప్రాధాన్యం
జూలైలో పంపిణీకి సన్నాహాలు
చేస్తున్న యంత్రాంగం
లక్ష్యం @ 25 లక్షలు


