పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల నిర్వహణ
స.హ.చట్టంపై అవగాహన
సమాచార హక్కు చట్టం, గ్రామసభ నిర్మాణ సారథ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు దేవసహాయం అన్నారు. సహచట్టం, గ్రామసభ నిర్మాణ సామర్థ్యంపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధిపరచడంలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషిస్తారని, కాబట్టి వీరంతా ఆయా అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సహచట్టం, గ్రామసభల నిర్మాణ సామర్థ్యంపై ఏడాది పొడవునా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీపీఓ రామ్మోహన్‌రావు, రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ హన్మంతు, రీసోర్స్‌పర్సన్స్ కృష్ణ, కోటేశ్వరరావు, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్: భూగర్భ జలాలు పెంపొందించడానికి, ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత ఆవశ్యకమైందని, నీటి అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్ తరాలకు నీటిని అందించడానికి నీటి కొరతను నివారించడానికి ఉపయోగపడుతుందని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరు నాటికి అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్‌గా మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, మురుగు నిల్వ ఉండే చోటు గుర్తించి ఇంకుడు గుంతలు నిర్మించాలని, గ్రామాల్లో శుభ్రత పాటించాలని పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని చెప్పారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. జిల్లా, గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య మిషన్ కమిటీ ప్రతినెల సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు, డీపీఓ రాంమోహన్‌రావు, డీఈఓ రమేష్‌కుమార్, డీఏఓ చంద్రశేఖర్, డీడబ్ల్యూ ఓ రాజేశ్వరి, డీటీడబ్ల్యూఓ ఫిరంగి పాల్గొన్నారు.


