ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలి
తెలకపల్లి: హిందు ధర్మాన్ని ప్రతిఒక్కరు కాపాడుకోవాలని అంబాత్రాయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామీజీ అన్నారు. తెలకపల్లిలో గురువారం రాత్రి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం వార్షికోత్సవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామీజీకి భక్తులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులనుద్దేశించి మాట్లాడారు. హిందువులంతా ధర్మం కోసం పాటుపడాలని, భక్తిభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఇతర మతాలకు ఆకర్షితులు కావొద్దని భక్తులకు సూచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, హిందూ దేవతలను నిత్యం పూజించాలన్నారు. ఏ ఒక్కరు పరమతానికి వెళ్లవద్దని, ఈ దేశంలో అత్యుత్తమమైనది హిందూ మతం అన్నారు. హిందూ మతాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవితాన్ని గడపాలని ఆయన ఆకాక్షించారు.
ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలి


