వినతులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు సత్వరమే పరిష్కరించాలి

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

● కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

ములుగు: ప్రజావాణి వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్‌ మొత్తంగా 22 దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 7 వినతులు రాగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని 2, పింఛన్లను ఇప్పించాలని 4, ఇతర శాఖలకు సంబంధించి 9 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement