ములుగు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్న అశా వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆశ కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్ ఎదుట కార్యాలయం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు డిసెంబర్ 15 నుంచి సమ్మె చేపడుతున్నట్లు నోటీసులు అందించినట్లు తెలిపారు. ఆశాలకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అక్టోబర్ నెలలో పెండింగ్ వేతనాలను అందించాలని వివరించారు. అలాగే ఆశాలకు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలాదేవి, రవిగౌడ్, శ్రావ్య, మహేశ్, కనకలక్ష్మి, రాజ్యలక్ష్మి, కవిత, పూర్ణ, రమాదేవి, సమ్మక్క, రజిత, నళిని పాల్గొన్నారు.


