ఎస్‌ఎస్‌తాడ్వాయి: వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని సమ్మక్క బాలుర విద్యార్థి నిలయంలో శుక్రవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా అధ్యక్షుడు రేవ కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బాలబాలికలకు రన్నింగ్, షాట్‌పుట్, ఆర్చరీ, లాంగ్‌జంప్ తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లావ్యాప్తంగా 62 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా క్రీడా ప్రముఖ్ చౌలం సాయిబాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైపతి సంతోష్, జిల్లా సంఘటన మంత్రి నూనె రాజు, సహ సంఘటన మంత్రి గొంది శోభన్‌బాబు, డాక్టర్ జగపతిబాబు, జగదీశ్, నాగుల సాయిబాబు, పీఈటీలు జోగా కృష్ణ, వనిత, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు
దూరంగా ఉండాలి
వెంకటాపురం(కె): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌తో ఎంతో మంది జీవితాలు నాశనమౌతున్నాయన్నారు. సమాజంలో జరిగే పలుహింసలకు డ్రగ్స్ కారణమన్నారు. అనంతరం వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్ధూరాజు, సీడీపీఓ ఇందిరమ్మ, బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ తదితరులు ఉన్నారు.
విదేశీ దిగుమతులతో
రైతులకు నష్టం
గోవిందరావుపేట: విదేశాల నుంచి జీరో టారిఫ్‌తో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులతో దేశీయ రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న 36వ అఖిలభారత కిసాన్ సభ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకట్ రెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి, గొంది రాజేష్, సూర్యనారాయణ, సదానందం, వెంకటేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు
ఆర్టీసీ శుభవార్త
హన్మకొండ: ప్రయాణికులను అకట్టుకునేందుకు టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు మంత్లీ సీజన్ టికెట్‌ను ప్రవేశపెట్టింది. రూట్ దూరాన్ని బట్టి మంత్లీ టికెట్ ధర ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్న వారు అదే రూట్‌లో కాకుండా ఇతర రూట్లలో 10శా తం రాయితీతో సూపర్ లగ్జరీ, ఆ పైబడిన సర్వీస్‌ల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఆదివారం కూడా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ నగరా ల్లోని అన్ని సిటీ బస్సుల్లో (పుష్పక్ ఏయిర్ ఫోల్ట్ మినహా) ప్రయాణించవచ్చు. ఇప్పటివర కు ఉన్న దూర పరిమితిని సంస్థ పూర్తిగా తొలగించింది. ధరల భారం మరింత తగ్గించే క్ర మంలో టోల్‌చార్జీలు 25 రోజుల నుంచి 20 రోజులకు కుదించారు. డీలక్స్ బస్సు ప్రయాణికులకు నెలవారీ సీజన్ టికెట్ తీసుకునే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా పల్లె వెలుగు నెలవారీ సీజన్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు రూ.20 చెల్లించి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, ఎక్స్‌ప్రెస్ నెలవారీ సీజన్ టికెట్ తీసుకున్న వారు రూ.20 అదనంగా చెల్లించి డీలక్స్ బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే 2నెలల కాల పరి మితికి టికెట్ తీసుకున్న వారు అదనంగా 5 రోజులు, 3నెలల పరిమితి టికెట్ తీసుకున్న వారు అదనంగా 10రోజులు ప్రయాణించవ చ్చు. మహిళలకు ఎక్స్‌ప్రెస్ వరకు ఉచిత ప్ర యాణం ఉండగా, డీలక్స్ సర్వీసులో 15 రోజు ల చార్జీలు చెల్లించి నెల పరిమితి కలిగిన సీజన్ టికెట్ తీసుకునే ప్రయోజనం కల్పించింది.


