ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

ములుగు: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలు, అమలు, నమోదు ప్రక్రియ, అవగాహన కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నవంబర్‌ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు ఎం. సంపత్‌ రావు, డీఆర్డీఓ రవీందర్‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు పాల్గొన్నారు.

నిరుపేదలకు జీవనోపాధి కల్పించాలి

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం అమలుపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్‌ వత్సల్‌ టొప్పోతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ మాట్లాడుతూ, ములుగు జిల్లాలో మిర్చి, ఇప్పపువ్వు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, సంబంధిత నిపుణుల సహకారంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ టీజీఐఎల్‌పీ కార్యక్రమం అమలవుతున్న రెండు మండలాలకే పరిమితం కాకుండా జిల్లాలోని మొత్తం పది మండలాల్లో జాబ్‌కార్డు మేళాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు ఎం. సంపత్‌ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నీటి లభ్యతకు అనుగుణంగా సాగు ప్రణాళిక

రబీ సీజన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వికసిత్‌ భారత్‌ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా ఉద్యాన పంటలు, కూరగాయలు, ఆయిల్‌ పామ్‌ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

వీసీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement