ములుగు: అడవుల సంరక్షణతోన పర్యావరణ సమతుల్యతను కాపాడగలమని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అటవీ అధికా రి వికాస్ మీనా, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు వాతావరణ మార్పులను తగ్గించడం, జీవవైవిధ్యం, జల వనరులను సంరక్షించడం, భూమి కోతను నివారించడంలో సహాయపడతాయన్నారు. అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలు సంయుక్త చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్‌రావుతో కలిసి కలెక్టర్ నూతన జాబ్ కార్డుల మంజూరు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులందరికీ జాబ్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


