– మరిన్ని ఫొటోలు 9లోu
ములుగు: జిల్లావ్యాప్తంగా నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్ల వారుజాము నుంచే మహిళలు, భక్తులు గ్రామాల శివారులోని నాగుల పుట్ట, ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతకు పసుపు, కుంకుమ, పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. నాగుల చవితి సందర్భంగా రామప్ప ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చన పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.


