ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని గ్రంథాలయం పాఠకులకు మెరుగైన సేవలు అందిస్తూ విజ్ఞానకేంద్రంగా విలసిల్లుతోంది. 26వేల పుస్తకాలు, పోటీ పరీక్షల అభ్యర్థులకు మెటీరియల్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండగా నిత్యం 120 మంది పాఠకులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రంథాలయానికి వచ్చే వారికి మెరుగైన వసతులు కల్పించడంతో పాటు పాఠకుల డిమాండ్ మేరకు లైబ్రేరియన్ పుస్తకాలను సమకూర్చుతున్నారు. గ్రంథాలయంలో 2,800 మంది సభ్యులు సభ్యత్వం పొంది ఉన్నారు. సభ్యత్వం కలిగి ఉండి కంప్యూటర్ వినియోగిస్తున్న వారి వద్ద నుంచి గంటకు రూ.10, సభ్యత్వం లేని వారి నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. రోజూ 13 రకాల న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. గ్రంథాలయ వేళలు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.
గ్రంథాలయానికి సెస్ బకాయిలు
జిల్లా గ్రంథాలయానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ నుంచి వసూలుచేస్తున్న పన్నులో 8 శాతం సెస్ చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సెస్ బకాయిలు పేరుకుపోవడంతో గ్రంథాలయంలో అభివృద్ధి పనులు, పుస్తకాల కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో సుమారు రూ.15 లక్షల మేర సెస్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.
విజ్ఞాన భాండాగారంగా జిల్లా గ్రంథాలయం
నిత్యం 120 మంది
పాఠకులకు సేవలు
పోటీ పరీక్షలకు మెటీరియల్,
ఇంటర్నెట్ సదుపాయం
గ్రంథాలయ సెస్ బకాయిలు
చెల్లించాలి


