సీఐడీ కస్టడీకి ఏడుగురు రైస్‌ మిల్లర్లు | - | Sakshi
Sakshi News home page

సీఐడీ కస్టడీకి ఏడుగురు రైస్‌ మిల్లర్లు

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

● నాలుగు రోజులకు అనుమతించిన ములుగు కోర్టు

● దొడ్డు బియ్యం సరఫరా కేసులో

సీఐడీ విచారణ ముమ్మరం

ములుగు: దొడ్డు బియ్యం సరఫరా వ్యవహారంలో అరెస్టయిన ఏడుగురు రైస్‌ మిల్లర్లను సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ సోమవారం ములుగు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్లు బాదం ప్రవీణ్‌, బండారి శ్రావణ్‌ కుమార్‌, ఎలగందుల మోహన్‌, అక్కల రఘోత్తం, పోతరాజు, యాద రామయ్య, మల్యాల ప్రవీణ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ పంపగా, సోమవారం వారిని నాలుగు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సీఐడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఈ కేసులో సీఐడీ దర్యాప్తు మరింత కీలకంగా మారింది. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన సన్న బియ్యం స్థానంలో దొడ్డువి సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇప్పటికే పలువురు మిల్లర్ల పాత్రపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న నిందితులను ప్రశ్నించి బియ్యం సేకరణ, సరఫరా, లావాదేవీలు, అధి కారుల పాత్ర తదితర అంశాలపై వివరాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ విచారణలో వెల్లడయ్యే అంశాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి.

రిమాండ్‌కు మరో ముగ్గురు మిల్లర్లు..

జిల్లాకు చెందిన మరో ముగ్గురిని సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాకు చెందిన మిల్లర్లు ఈదునూరి వెంకటపాపిరెడ్డి, కాట్రగడ్డ సుధీర్‌, రేపాక సత్యంను కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు పాటు రిమాండ్‌ విధించింది.

చికిత్స పొందుతున్న తాజా అధ్యక్షుడు..

ములుగు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తాజా జిల్లా అధ్యక్షుడు కాట్రగడ్డ సతీశ్‌ను గత నెల 30న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో సతీశ్‌ అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. దీంతో ములుగు జిల్లా ప్రభుత్వఆస్పత్రిలో ఆయనకు పోలీ సుల పర్యవేక్షణలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement