‘నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి’

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

ములుగు: జిల్లాలో వ్యాపారులు నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్‌ హుస్సేని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైస్‌ మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు బియ్యం ధరల పట్టికను విని యోగదారులకు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 26 కిలోల బస్తా విక్రయించే బియ్యానికి కిలోకు గరిష్ఠ రిటైల్‌ ధరలు బీపీటీ రకానికి రూ.66, ఆర్‌ఎన్‌ఆర్‌/తెలంగాణ సోనాకు రూ.74, హెచ్‌ఎంటీ/జేఎస్‌ఆర్‌ రకానికి రూ.79గా పేర్కొన్నారు. ఆయా రకాల బియ్యాన్ని నిర్ణయించిన ధరలకు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement