చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఉండాలి

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

గోవిందరావుపేట: బాలల భద్రత, రక్షణ చట్టాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి చండీశ్వరీ దేవి అన్నారు. సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ములుగు సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని 16 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కేజీబీవీల్లోని బాలబాలికలకు అవగాహన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చల్వాయి మోడల్‌ స్కూల్‌లో జడ్జి చండీశ్వరీ దేవి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మంచి, చెడు స్పర్శల మధ్య తేడాలను గుర్తించాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బందికరంగా తాకినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. అలాగే చల్వాయి జెడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీతో పాటు కర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 జిల్లా కోఆర్డినేటర్‌ నరేశ్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ సుశీల్‌ వంశీ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత పాల్గొని మాట్లాడారు. పిల్లలు వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను తెరవకూడదని తెలిపారు. బాలల అక్రమ రవాణా ప్రమాదాలను వివరిస్తూ అపరిచితుల ప్రలోభాలకు గురికాకూడదని సూచించారు. అలాగే బొమ్మ ద్వారా చెడు, మంచి స్పర్శలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మహేందర్‌, పస్రా రెండో ఎస్సై ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి చండీశ్వరీ దేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement