● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
మంగపేట: పీహెచ్సీలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మండలంలోని చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో వైద్యసేవలు, పారిశుద్ధ్య పరిస్థితులు, మందుల నిల్వలను పరిశీలించారు. పీహెచ్సీ నిర్వాహణ, వైద్యాధికారి, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వల రికార్డులు, వ్యాక్సిన్ల నిల్వ చేసేందుకు వినియోగించే రిఫ్రిజిరేటర్ను పరిశీలించి వాటి నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో అడవిని తలపించేలా చెట్లు, పిచ్చిమొక్కలు, పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యాధికారి, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వై ద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కీర్తి, పీహెచ్ఎన్ ఇంద్రావతి, ఎల్టీ కోరెం శ్రీనివాస్, హెచ్ఎస్ పద్మ, స్టాఫ్ నర్స్ లహరిక, ఎల్టీ అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు.


