సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

మంగపేట: జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో దుర్గాదేవి అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చింది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆరవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ఉమా చంద్రశేఖరస్వామి ఆలయంలో అర్చకులు విస్సావజ్జుల నరేష్‌శర్మ ఉమాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిమను సరస్వతీదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుగ్రామాల్లో భక్తులకు దేవీనవరాత్రి ఉత్సవాల భక్తమండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందించారు.

మరిన్ని ఫొటోలు IIIలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement