ములుగు రూరల్: ప్రభుత్వం రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ముట్టడి చేపట్టగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల కరెంటు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పడు 12 గంటలు మాత్రమే అందిస్తుందని ఆరో పించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు.కార్యక్రమంలో నాయకులు జాడి రామరాజు, భర్తపురం నరేష్, వెంకటేశ్వర్లు, మాదరి శ్రీకాంత్, బుచ్చయ్య, నాగరాజు, వెంకన్న, రాజశేకర్, సారయ్య, అనిల్, నవీన్, వెంకటేశ్, ప్రశాంత్, మమన్యాదవ్ పాల్గొన్నారు.


