వెంకటాపురం(ఎం)లో సద్దుల బతుకమ్మ ప్రదేశంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు
వెంకటాపురం(ఎం) లింగయ్యకుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాలు
ములుగు/ఏటూరునాగారం: నేటి సద్దుల బతుకమ్మ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన కూడళ్లు, చెరువులు, కుంటల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆడపడుచులు రాత్రి వరకు బతుకమ్మలు ఆడడంతో పాటు నిమజ్జనం చేసేందుకు వీలుగా అధికారులు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే చెరువులు, కుంటల వద్ద హైమాస్ట్ లైట్లు, విద్యుద్దీపాలు అమర్చారు. నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించారు. చెరువుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
సద్దులకు
సర్వం సిద్ధం
పూల దుకాణాల్లో కొనుగోళ్ల సందడి
● చెరువుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు


