బతుకమ్మ ప్రకృతికి ప్రతిరూపం. మానవాళి మనుగడకు కీలకాధారం. అందుకే ఆ ప్రకృతిని అమ్మవారి రూపంగా భావిస్తూ చెట్టుకు, పుట్టకు, పూలకు, నీళ్లకు అన్నింటికీ కృతజ్ఞత చూపుతారు. ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని బతుకమ్మ ఆడుతూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తీరొక్క పూలు సేకర | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ప్రకృతికి ప్రతిరూపం. మానవాళి మనుగడకు కీలకాధారం. అందుకే ఆ ప్రకృతిని అమ్మవారి రూపంగా భావిస్తూ చెట్టుకు, పుట్టకు, పూలకు, నీళ్లకు అన్నింటికీ కృతజ్ఞత చూపుతారు. ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని బతుకమ్మ ఆడుతూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తీరొక్క పూలు సేకర

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

ఆ ఊరికే ప్రత్యేకం.. పెద్ద బతుకమ్మ

జఫర్‌గఢ్‌: సద్దుల బతుకమ్మకు మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన పోరెడ్డి సత్యనారాయణరెడ్డి కుటుంబం పెద్ద బతుకమ్మతో (5 ఫీట్లు) ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏళ్లుగా తన తండ్రి నర్సింహారెడ్డి నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సద్దుల పండుగకు వివిధ రకాల పూలను సేకరించి కుటుంబ సభ్యులంతా కలిసి అందంగా బతుకమ్మను పేరుస్తారు. సాయంత్రం సమయంలో ఇంటిల్లిపాది పెద్ద బతకమ్మను తీసుకుని డప్పుచప్పుళ్లు, డీజేతో ఊరేగింపుగా బతుకమ్మ ఆటస్థలానికి వెళ్తారు. గ్రామ మహిళలతో కలిసి సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. కొన్ని రకాల పూలు దొరక్కపోయినా కొనుగోలు చేసి మరీ పేరుస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

సద్దుల బతుకమ్మ వేడుకలకు అమెరికా నుంచి వచ్చిన అఖిల, హాసిని (ఫైల్‌)

ఏటూరునాగారం: తాతముత్తాల నుంచి ఆనవాయితీగా ఎత్తయిన బతుకమ్మను పేరుస్తూ మండలంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలోని నూతి కృష్ణ జ్యోతి. 70 ఏళ్లుగా ఐదు ఫీట్ల ఎత్తులో తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తున్నారు. వారం రోజుల నుంచే పూలు సేకరిస్తున్నారు. స్థానికంగా దొరకని పూలను వరంగల్‌ నుంచి తెప్పించి మరీ పెద్ద బతుకమ్మను పేరుస్తున్నారు. కాగా, సద్దుల బతుకమ్మ రోజు తమ ఇంట్లోని ముగ్గురు మహిళలు ఉదయం 8 గంటల నుంచి పేర్చడం ప్రారంభిస్తే సాయంత్రం వరకు సమయం పడుతుందని, ఈ సమయంలో అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడుతామని వారు చెబుతున్నారు. ఇన్నేళ్ల నుంచి గ్రామంలో ఇదే పెద్దదిగా పేరుగాంచింది.

ఆకర్షణగా నిలుస్తున్న పెద్ద బతుకమ్మలు

సాక్షి, మహబూబాబాద్‌: హైదరాబాద్‌లో ఉన్నా.. అమెరికాలో ఉన్నా ఆ ఇంటికి బంధువులు, ఆడపడుచులు బతుకమ్మ పండుగకు రావాల్సిందే.. ముప్పై ఏళ్లుగా పెద్ద బతుకమ్మను పేరుస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన పర్కాల శ్రీనివాస్‌రెడ్డి హేమలత దంపతులు. ముప్పై ఏళ్ల క్రితం పర్కాల రంగారెడ్డి, పూలమ్మ దంపతులు ప్రారంభించిన ఈ ఆనవాయితీని ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, హేమలత దంపతులు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కూతుళ్లు అఖిల, వినీల, కోడలు ప్రదీప, మనుమరాలు హాసిని హైదరాబాద్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా సద్దుల బతుకమ్మ పండుగకు వస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement