గతంలో ఇందిరమ్మ ఇల్లు అసంపూర్తిగా నిర్మాణం చేసుకున్న, రూప్‌లెవల్ కాంక్రీట్ స్లాబ్ కావాల్సిన లబ్ధిదారులు స్థానిక గ్రామ పంచాయతీ, హౌసింగ్ ఏఈలకు, సర్పంచ్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇలా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి, ఇంటిని తనిఖీ చేసి రూప్‌లెవల్ కాంక్రీట్ స్లాబ్ యూనిట్‌ను మంజూరు చేయనున్నారు. ఇప్పటికై నా జిల్లాలో ఎవరైనా ఎల్–3లో ఉన్న లబ్ధిదారులు సదరు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
● ఇందిరమ్మ ఇల్లు రాని, ఎల్–3 కేటగిరీలో ఉన్న వారికి మరోచాన్స్
● జిల్లాకు 500 యూనిట్లు మంజూరు
● ఇప్పటి వరకు 250 దరఖాస్తులు
ఎక్కడ దరఖాస్తు
చేసుకోవాలి?
ఏటూరునాగారం: జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు రాని వారికి, ఎల్–3 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రభుత్వం, హౌసింగ్ కార్పొరేషన్ (పంచాయతీ రాజ్) అధికారులు లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అరకొరగా వచ్చాయి. జిల్లాలో తొలిదశలో గోడలు, పిల్లర్లు ఉండి కాంక్రీట్ స్లాబ్ లేనివారు, గతంలో ఇందిరమ్మ ఇల్లు అసంపూర్తిగా నిర్మాణం చేసుకున్న వారికి బిలో పావర్టీ ఉన్న లబ్ధిదారులకు రూప్‌లెవల్ కాంక్రీట్ స్లాబ్ వేసుకునేందుకు అవకాశం కల్పించింది. రూ.2లక్షల నిధులతో పాత ఇంటి గోడలు, పాత పిల్లర్లపై స్లాబ్ వేసుకునే వెసులుబాటు కల్పించి వారికి ఇందిరమ్మ యూనిట్‌ను అందించనుంది. ఇందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈలు ప్రత్యేక సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది.
ఎల్–3 కేటగిరీ అంటే?
ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం ఎల్–1, 2, 3 కేటగిరీలుగా విభజించింది. ఇందులో ఎల్–3 కేటగిరీ అంటే మొదటి రెండు విడతల్లో ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులైన నిరుపేదలు, గతంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిపొంది అసంపూర్తి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
జిల్లాకు 500 యూనిట్లు మంజూరు
జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న ఇందిరమ్మ ఎల్–3 లబ్ధిదారులకు 500 యూనిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు, ఎల్–3 కేటగిరీలో ఉన్న వారికి రూ.2 లక్షల యూనిట్‌ను అందించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తులను స్వీకరించి వాటిని మంజూరు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.


