చేతిపంపు మీదుగా డ్రెయినేజీ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

చేతిపంపు మీదుగా డ్రెయినేజీ నిర్మాణం

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్వ నిర్మాణానికి అడ్డుగా ఉన్న చేతిపంపును తొలగించకుండా దాని మీదుగా నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో చేతిపంపు వినియోగానికి ఇబ్బంది కలగడంతో పాటు.. భవిష్యత్‌లో కాల్వలో వెళ్లే నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నేడు హుండీల లెక్కింపు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం హుండీల్లోని కానుకలను గురువారం ఉదయం లెక్కించనున్నట్లు దేవస్థానం చైర్మన్‌ అవధాని మోహన్‌శర్మ, ఈఓ మహేష్‌ బుధవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి దేవస్థానం డైరెక్టర్లు, భక్తులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.

గోదావరి పుష్కరాలకు నిరంతర విద్యుత్‌

మల్హర్‌/మల్హర్‌(కాటారం)/కాళేశ్వరం: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి విద్యుత్‌ అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో కాటారం ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ వరుణ్‌ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సరస్వతీ బ్యారేజీ నుంచి కాళేశ్వరం వరకు చేపడుతున్న 33 కేవీ ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌ పనులు, మల్హర్‌ మండలంలోని తాడిచర్లలో కొత్తగా నిర్మిస్తున్న 132 కేవీ సబ్‌ స్టేషన్‌ స్థలాన్ని పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ప్రతిపాదిత నూతన సబ్‌ స్టేషన్ల స్థలాలను పరిశీలించారు. విద్యుత్‌ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. సబ్‌స్టేషన్‌లో పని చేసే సమయంలో భద్రతా నింబంధనలు పాటించాలని, ఎల్‌సీ(లైన్‌ క్లియర్‌) యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సదానందం, డీఈలు పాపిరెడ్డి, జగదీష్‌బాబు, ఈఈ సివిల్‌ వెంకట్రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం

గణపురం: ప్రజలకు విద్యుత్‌ భద్రత కల్పించడమే లక్ష్యంగా విద్యుత్‌ శాఖ పని చేస్తుందని సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గాంధీనగర్‌లో సబ్‌స్టేషన్‌ ప్రతిపాదిత స్థలాన్ని ఆయన బుధవారం స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలను వేగవంతంతగా పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్‌ఈ సదానందం, డీఈ పాపిరెడ్డి, టెక్నికల్‌ డీఈ జగదీశ్‌బాబు, సివిల్‌ ఈఈ వెంకట్రామ్‌ పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందులు

కలగొద్దు

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. ఈమేరకు బుధవారం వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారి పూజావేదిక, ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, తోట పవన్‌, శ్రీకర్‌, రవీందర్‌రెడ్డి, కుమార్‌యాదవ్‌, రాజు సతీశ్‌, దేవాలయ అర్చకులు ప్రణవ్‌, వేముగంటి దత్తుశర్మ, సిబ్బంది మధుకర్‌, పురావస్తుశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement