భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

ములుగు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీసర్వేను పకడ్బందీగా అధికారులు నిర్వహించాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో భూ రీసర్వేపై ఐడీఓసీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీసర్వే పనుల్లో వేగం పెంచాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తూ కొలతలు, భూ వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి, సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందిస్తూ, భూ సమస్యల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement