పోషణ.. ఆరోగ్య రక్షణ | - | Sakshi
Sakshi News home page

పోషణ.. ఆరోగ్య రక్షణ

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

● చిన్నారులు, గర్భిణులు,

బాలింతలకు పౌష్టికాహారం

● ఐసీడీఎస్‌ అధికారుల

అవగాహన సదస్సులు

● జిల్లాలో ఈ నెల 8వ తేదీ వరకు

పోషణ మాసోత్సవాలు

గోవిందరావుపేట: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి సకాలంలో నివారించడంతో పాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ఐసీడీఎస్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాలో జాతీయ పోషణ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ములుగు, ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టుల పరిధిలో నెల రోజుల పాటు రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 3ఏళ్ల లోపు చిన్నారులు 9,330 మంది ఉండగా 3–6 ఏళ్లు ఉన్నవారు 7,946 మంది ఉన్నారు. ఈ చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై అంగన్‌వాడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. చిన్నారుల ఎత్తు, బరువు తదితర కొలతలను క్రమం తప్పకుండా తీసుకుంటూ వారి ఎదుగుదల ఉందా లేదా అన్నది పరిశీలిస్తున్నారు. అదే విధంగా 830 మంది చిన్నారులు మోస్తరు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. వీరిలో 188 మంది తీవ్రమైన పోషకాహార లోపం (ఎస్‌ఏఎం)తో ఉన్నారు. ఈ చిన్నారుల ఎత్తు, బరువు తదితర కొలతలను క్రమం తప్పకుండా తీసుకుంటూ వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉందా లేదా అన్నది పరిశీలిస్తున్నారు.

తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా..

జిల్లాలో 2,041 మంది గర్భిణులు ఉండగా 1,039 మంది బాలింతలు ఉన్నారు. గర్భిణి నుంచి శిశువు ఎదుగుదల వరకు తల్లీబిడ్డలకు అవసరమైన పౌష్టికాహారం అందేలా అవగాహన కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలతో సమావేశాలు నిర్వహించి సమతుల ఆహారం, పరిశుభ్రత, శిశు సంరక్షణపై సూచనలు చేస్తున్నారు. అలాగే పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఆహారపు అలవాట్లపైనా ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజువారీ ఆహారంలో చక్కెర, నూనె వినియోగాన్ని పరిమితం చేయడం, అధిక తీపి పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించడం, పౌష్టికాహార విలువలున్న సహజ ఆహార పదార్థాలను తీసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పౌష్టికాహారం తయారు చేసుకునే విధానాలను మహిళలకు వివరించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వంటకాల పోటీలు నిర్వహిస్తున్నారు.

పౌష్టికాహారం అందేలా చర్యలు

జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్‌ల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తొలిదశలోనే గుర్తించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణుల వివరాలు నమోదు చేసి వారికి అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

– ప్రేమలత, డీడబ్ల్యూఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement