ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఉన్న నీలంతోగూడెం గొత్తికోయగూడెంకు కొడిశాల పీహెచ్‌సీ వైద్యసిబ్బంది ట్రాక్టర్‌పై వెళ్లి బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యాధికారి విజయ్ గూడెంలోని చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. జ్వర లక్షణాలతో బాధపడుతున్న వారికి ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ (ఆర్‌డీటీ) పరీక్షలు చేశారు. అవసరమైన వారికి సలహాలు, సూచనలు చేశారు. అటవీప్రాంతంలో ఉన్న ఈ గూడెం బయ్యక్కపేటకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి సాధారణ వాహనాలు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా లేదు. దీంతో వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ ట్రాక్టర్‌పై వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందించారు. రహదారి సౌకర్యం లేకపోయినా గూడెంకు చేరుకుని వైద్యశిబిరం నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


