ఆశ్రమ పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాల తనిఖీ

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టంలో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ జనార్దన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులు, హాజరు రిజిస్టర్లు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలను క్షుణ్ణంగా పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థులు చదవడం, రాయడం సామర్థ్యాలపై ఆరా తీశారు. అనంతరం హాస్టల్‌ వసతులను పరిశీలించారు. విద్యార్థినులకు అందించే భోజన నాణ్యత, మెనూ వివరాలను తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందుతున్న స్కాలర్‌షిప్‌లు, పాఠ్యపుస్తకాలు, టై, బెల్ట్‌, షూస్‌ తదితర సామగ్రి పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట పాఠశాల పీజీ హెచ్‌ఎం కల్తి శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement