తెల్లవారుజాము వరకు నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

తెల్లవారుజాము వరకు నిమజ్జనం

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

ఏటూరునాగారం: మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద నిమజ్జన వేడుకలు బుధవారం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఏటూరునాగారం సర్పంచ్‌ కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహరావు ఆధ్వర్యంలో ముళ్లకట్ట వద్ద భారీ క్రేన్లు, వి ద్యుత్‌ దీపాలు, భక్తులకు భోజనం, తాగునీటి వసతి కల్పించారు. గోవిందరావుపేట, తాడ్వా యి, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల నుంచి సుమారు 200 విగ్రహాలను భక్తులు నిమజ్జనానికి తీసుకొచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెల్లవారు జాము వరకు ఏఎస్పీ మనన్‌ భట్‌తోపాటు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు పర్యవేక్షించారు. సీఐలు సూర్యప్రకాశ్‌, ముత్యం రమేష్‌ నిమజ్జనాలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు.

పర్యవేక్షించిన ఏఎస్పీ మనన్‌భట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement