ములుగు: పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా చైర్మన్ పోలురాజు నేతృత్వంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవికాంత్, డిప్యూటీ కన్వీనర్ చైతన్య, డీటీఎఫ్ ఆదిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ సమ్మారావు, ఉదయ్ కుమార్ రెడ్డి, టీఎన్‌జీవోస్ కోశాధికారి కుమారస్వామి, ఎస్‌టీయూ నాయకులు మధుసూదన్, అహ్మద్, కో–చైర్మన్ యశ్వంత్, హెచ్‌డబ్ల్యూఓల అధ్యక్షురాలు సరిత, ఇరిగేషన్ ఫోరం అధ్యక్షుడు ప్రదీప్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రవి, జిల్లా కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు.


