ఖమ్మం డిపో బస్సులపై ఆర్‌ఎం ఆరా | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం డిపో బస్సులపై ఆర్‌ఎం ఆరా

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బ స్టాండ్‌కు ఖమ్మం రీజియన్‌ నుంచి వచ్చే ఆర్టీసీ షటిల్‌ బస్సుల కండక్టర్‌, డ్రైవర్ల పనితీరును ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ సరిరామ్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగూడెం బస్సు డ్రైవర్‌, కండక్టర్‌తో మాట్లాడి ఎస్‌ఆర్‌ను పరిశీలించారు. బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారని తెలుసుకున్నారు. టికెట్లు నిబంధనల ప్రకారం అందించాలని, హెచ్చుతగ్గులు లేకుండా సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో ఆపరేషన్‌ మేనేజర్‌ మల్లయ్యతో పాటు ఏటూరునాగారం కంట్రోలర్‌ శంకర్‌ పాల్గొన్నారు.

‘అంగన్‌వాడీ పోస్టులన్నీ

భర్తీ చేయాలి’

ములుగు: ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం డీడబ్ల్యూఓ ప్రేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, అంగన్‌వాడీ యూని యన్‌ జిల్లా కార్యదర్శి సమ్మక్క మాట్లాడుతూ ఏజెన్సీ పోస్టులు భర్తీ కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త గ్యాస్‌ కనెక్షన్లతో పాటు వంట పాత్రలు, ఫ్యాన్లు అందించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్యాస్‌, ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మరాణి, భాగ్యలక్ష్మి, సరిత, నాగలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ధర్నా

ములుగు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం అమానుషమన్నారు. దాడులతో బీజేపీని భయపెట్టలేరని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి నాయక్‌, భూక్యా జవహర్‌ లాల్‌, నాయకులు గుగులోత్‌ స్వరూప, జినుకల కృష్ణాకర్‌ రావు, అల్లె శోభన్‌, నగరపు రమేశ్‌, కొర్ర సుమలత, జనార్దన్‌, గాదం కుమార్‌, ఎల్కతుర్తి శ్రీహరి పాల్గొన్నారు.

సమష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన ఆయన.. సెప్టెంబర్‌ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆగస్టులో ఏరియాకు 3.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం ఉండగా 1.60 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. లక్ష్యంలో 43 శాతం సాధించి రవాణా చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 5,157 టన్నులుగా నమోదైందన్నారు. సెప్టెంబర్‌ నెలకు 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్పత్తి పెంపునకు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎస్‌డీఎల్‌ యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement