సురేఖకు ఢిల్లీ పిలుపు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. సురేఖకు ఏం జరుగుతుంది? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మంత్రి పదవిలో కొనసాగుతారా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ నుంచి వెలువడే నిర్ణయంతోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది.


