కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎమర్జెన్సీ మెడికల్‌ బాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎమర్జెన్సీ మెడికల్‌ బాక్స్‌

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వేస్టేషన్‌లోని స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్‌ 101 ఎమర్జెన్సీ మెడికల్‌ బాక్స్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్‌ కిట్‌లో గాయాలకు డ్రెస్సింగ్‌లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్‌, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్‌ బాక్స్‌ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement