‘సేంద్రియం’ వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

‘సేంద్రియం’ వైపు అడుగులు

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

ములుగు రూరల్‌: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని పోత్సహించాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ (నేషనల్‌ మిషన్‌ అన్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌) అనే పథకాన్ని అమలు చేస్తుంది. రసాయన ఎరువుల వినియోగంతో పంట పొలాలు నిర్జీవంగా మారుతున్నాయనే కారణంగా ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ రైతులను సేంద్రియ సాగు వైపు దృష్టి మళ్లించేందుకు శ్రీకారం చుట్టింది. రైతులు పంటల సాగులో అధికంగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం రోజురోజుకూ దెబ్బతింటుంది. రసాయనాలతో సాగు చేసిన పంటలను తినడం మూలంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలోని మండలాల వారీగా గ్రామాలను ఎంపిక చేసుకొని ఒక్కో రైతు ఎకరం భూమిలో (జిల్లాలో 125 మంది) సేంద్రియ సాగు చేసేలా సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో 17 క్లస్టర్లు ఎంపిక

జిల్లాలోని పది మండలాల్లో కలిపి మొత్తం 17 క్లస్టర్‌లను ఎంపిక చేశారు. ఎంపికై న గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంపిక చేసుకొని ఒక్కో రైతు ఎకరం భూమిలో సేంద్రియ సాగు చేపట్టనున్నారు. ఎంపికై న రైతుల భూములకు భూసార పరీక్షలు నిర్వహించి ఏ రకం పంటలు సాగు చేయాలనే విషయం తెలియజేస్తారు. సాగు చేసిన పంటలకు మొదటి విడతలో పంటకు సరిపడా వేప పిండి, వేప నూనె ఉచితంగా అందిస్తారు. సేంద్రియ విధానంలో పండించి పంటలకు మార్కెట్‌లో ఉండే డిమాండ్‌ను వివరించి రైతులను చైతన్య పరుస్తారు. జిల్లాలో సేంద్రియ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రోత్సహించేందుకు వెలుగు రేఖ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

భూసార పరీక్షల ఆధారంగా సాగు

సేంద్రియ సాగు కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలను సేకరించారు. దీంతో పాటు సేంద్రియ సాగు పంటలకు ఉన్న డిమాండ్‌ను రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు నెలల క్రితం గ్రామాల ఎంపిక కావడంతో భూసార పరీక్షలకు మట్టి సేకరణ పూర్తి చేసి ల్యా బ్‌కు పంపించారు. దేశం మొత్తం సేంద్రియ సాగు ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని భావించి గ్రామాల్లో రైతులను ఎంపిక చేసుకొని సేంద్రియ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం, కలుషిత ఆహార నియంత్ర ణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

రసాయన ఎరువుల నియంత్రణే లక్ష్యం

జిల్లాలో 17 క్లస్టర్లు,

ఒక్కో క్లస్టర్‌లో 125 ఎకరాలు

భూసార పరీక్షల

నమూనా సేకరణ పూర్తి

‘వెలుగు రేఖ’ సొసైటీ ఆధ్వర్యంలో

రైతులకు అవగాహన

మొదటి విడత పంటలకు

వేప పిండి, వేప నూనె ఉచితం

మండలం గ్రామాలు

ములుగు జగ్గన్నపేట, అంకన్నగూడెం,

కన్నాయిగూడెం

మల్లంపల్లి రాంచంద్రాపురం

వెంకటాపురం(ఎం) తిమ్మాపురం, పాలంపేట

గోవిందరావుపేట ముత్తాపూర్‌, రంగాపురం

తాడ్వాయి పంబాపూర్‌, నార్లాపూర్‌

ఏటూరునాగారం ఏటూరునాగారం

మంగపేట నిమ్మగూడెం, నర్సాయిగూడెం,

కొత్తూరుమొట్లగూడెం

కన్నాయిగూడెం సర్వాయి

వెంకటాపురం(కె) రాచపల్లి

వాజేడు అరుణాచలపురం

జిల్లాలో సేంద్రియ సాగుకు ఎంపికై న గ్రామాలు

ప్రకృతి సాగుకు డిమాండ్‌ ఎక్కువ

రైతులు ప్రకృతి సాగు చేస్తూ పండించిన పంటలకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంటుంది. రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం ప్రవేశపెట్టింది. ఎంపికై న గ్రామాల్లో రైతుల భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించాం. భూ స్వభావాన్ని బట్టి పంటల సాగును చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో సేంద్రియ సాగు పంటల వినియోగం పెరుగుతుంది.

– సురేష్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement