ములుగు రూరల్: పోలీసులు విధుల్లో అంకితభా వంతో పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విధుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కర్రెగుట్టల్లో రహదారి పనుల్లో సేవలందించిన స్పెషల్ పార్టీ సిబ్బందిని అభినందించారు. మేడారం జాతర సమయంలో విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రయాణ భత్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. కఠిన సేవా పతకంలో అర్హులైన సిబ్బంది పేర్లను పరిశీలించి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్ తి రుపతి, సీఐ సురేష్, తదితరులు పాల్గొన్నారు.


