రామప్ప సరస్సులోని ఐలాండ్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సాస్కి పథకం కింద మంజూరైన రూ.13 కోట్లతో ఐలాండ్‌లో భారీ శివుని విగ్రహం, రెస్టారెంట్, కెఫిటేరియా, చిల్డ్రన్స్ పార్కు, బటర్‌ఫ్లై గార్డెన్ నిర్మిస్తుండగా పనులు వేగవంతంగా కొనసాగడం లేదనే విమర్శలున్నాయి. గత సంవత్సరం నవంబర్ మాసంలో పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు పనుల పురోగతిలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. డిసెంబర్‌లోగా ఐలాండ్‌లో జరుగుతున్న పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని టూరిజం అధికారులు చెబుతున్నప్పటికి ఇప్పటివరకు 50 శాతం పనులు కూడా పూర్తికాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐలాండ్‌లో నత్తనడకన కొనసాగుతున్న పనులు


