ములుగు:/ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పరాభవ నామసంవత్సరాదికి స్వాగతం పలుకుతూ భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఆరగించారు. సమీప ఆలయాల్లోకి కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారు. రైతన్నలు పశువులను కడిగి కొత్తసాలుకు శ్రీకారం చుట్టారు. గోమాతలకు పూజలు నిర్వహించి సల్లంగా చూడాలని వేడుకున్నారు. పోలీస్‌స్టేషన్లలో, ఆలయాల్లో ఉగాది పచ్చడిని తయారు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని రామాలయంలో కవి సమ్మేళనాన్ని రామప్ప సాహితి సమితి, జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు వారి కవితలను వినిపించారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామప్ప సాహితి సమితి అధ్యక్షుడు శ్రీనివాసచారి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్, కవులు రాజుయాదవ్, పోషన్న, రమేష్, లెనిన్, రాజశేఖర్, కుమారస్వామి, దుర్గం సూరయ్య, తుమ్మ పిచ్చిరెడ్డి, రేలా విజయ్, అనిల్, రామాలయ కమిటీ అధ్యక్షుడు దొంతిరెడ్డి రాకేశ్‌రెడ్డి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు
పరాభవ సంవత్సరానికి
స్వాగతం పలికిన ప్రజలు


