వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్‌షా, తరుణ్‌గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొనియాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్‌ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు తదితరులు పాల్గొన్నారు.


