వెంకటాపురం(కె): మిర్చి పంటపై పరదాలు కప్పుతున్న రైతులు
వెంకటాపురం(కె)/వాజేడు: ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గురువారం వెంకటాపురం(ఎం), వాజేడు మండలాల్లో పలుచోట్ల చిరుజల్లులు పడడంతో మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. రెండేళ్లుగా మిర్చి రైతులకు దిగుబడి రాకపోవడంతో పాటు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. ఈ ఏడాది మిర్చి పంటకు మంచిధర ఉంది. ఈ క్రమంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో దిగులు చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చిపంట తడవకుండా ఉండేందుకు పరదాలు కప్పుతున్నారు.


