నీటి ఎద్దడి నివారణకు బోరు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు బోరు ఏర్పాటు

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

బాధ్యతల స్వీకరణ

ములుగు రూరల్‌: మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు రంగారావుపల్లిలో నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించారు. ఈ మేరకు బుధవారం 4వ వార్డు కౌన్సిలర్‌ గుంటోజు పావని భూమి పూజ చేసి బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఎన్నికల సమయంలో రంగారావుపల్లి ప్రజలకిచ్చిన హామీ నేరవేర్చారని తెలిపారు. అదే విధంగా కాలనీలో నె లకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పావని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివ, రవి, రూప్‌సింగ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ములుగు రూరల్‌: ములుగు ఎస్సైగా ఉపేందర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.

మహిళా ఉద్యోగులు

క్రీడా పోటీల్లో పాల్గొనాలి

ములుగు రూరల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో మ హిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీఎన్‌జీవోస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, కార్యదర్శి మేడిపల్లి చైతన్యలు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. సీ్త్ర–శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో టీజీవో, టీఎస్‌జీవో సహకారంతో నేడు, రేపు బండారుపల్లి రోడ్డులోని గిరిజన భవన్‌లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

‘కాల్వపల్లి రైతులపై దాడి జరగలేదు’

ఏటూరునాగారం: కాల్వపల్లికి చెందిన రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయలేదని అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని ఛానల్స్‌, పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వివరించారు. వార్తలు రాసే విషయంలో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement