నేడు మేడారానికి పొంగులేటి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మేడారానికి పొంగులేటి రాక

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

నేడు

నేడు మేడారానికి పొంగులేటి రాక

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి నేడు (శనివారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రానున్నారు. మంత్రి సీతక్కతో కలిసి ఆయన అమ్మవార్ల గద్దెల ప్రాంగణం నిర్మించిన ఆల య పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పెండింగ్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పెండింగ్‌ మిల్లింగ్‌ చార్జీలు విడుదల చేయాలి

ములుగు రూరల్‌: పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్‌ చార్జీలను విడుదల చేయాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా సివిల్‌ సప్లయీస్‌ డీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణిని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్‌ చార్జిలను విడుదల చేయాలన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని డీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

వాడబలిజలు అన్నిరంగాల్లో రాణించాలి

వాజేడు: వాడబలిజ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గురి రమణయ్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో శుక్రవారం ధర్మవరం, బీసీ మర్రిగూడెం గ్రామాలకు చెందిన వాడబలిజ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలకు విద్య ఎంతో ముఖ్యమైందన్నారు. ప్రతీ విద్యార్థికి తమ తల్లిదండ్రులు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధను చూపాలన్నారు. రానున్న రోజుల్లో వాడబలిజలు అన్ని రంగాల్లో రాణించాలని దానికి సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు నాగార్జున, రఘుబాబు, సమ్మయ్య, శ్రీధర్‌ తదితరులున్నారు.

బడిలో మట్టి కుండల

వర్క్‌షాప్‌

కాళేశ్వరం: జిల్లాస్థాయి జాతీయ సైన్స్‌ దినోత్సవం వేడుకలను మహదేవపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో మట్టి కుండల తయారీ వర్క్‌ షాప్‌తో ప్రారంభించారు. కుమ్మరివారితో కుండల తయారీ విధానాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్‌ అధికారి స్వామి మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టిపాత్రలు వాడాలని తెలిపారు. ప్రాచీన కాలంలో ఇంట్లో ప్రతీ వస్తువు మట్టితో తయారుచేసిన వంట పాత్రలు, నీటిని నిలువ చేసే పాత్రలు, ధాన్యం నిల్వచేసే కాగులు పేర్పులు మొదలగు మట్టిపాత్రలు ఉపయోగించేవారని తెలిపారు. దీంతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు కుటీర పరిశ్రమలు బలపడేవని తెలిపారు. నేటి సమాజంలో మట్టి పాత్రలన్నీ కనుమరుగైపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం, బయోసైన్స్‌ జిల్లా ఫోరమ్‌ అధ్యక్షుడు బి.ప్రభాకర్‌ రెడ్డి, సర్పంచ్‌ హసీనభాను, ఉపసర్పంచ్‌ శ్రీజ, బాలికల పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం సరిత, పి.కల్యాణి, ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం యాస్మిన్‌, వివిధ పాఠశాలల సైన్స్‌ టీచర్లు పాల్గొన్నారు.

నేడు మేడారానికి  పొంగులేటి రాక
1
1/2

నేడు మేడారానికి పొంగులేటి రాక

నేడు మేడారానికి  పొంగులేటి రాక
2
2/2

నేడు మేడారానికి పొంగులేటి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement