కల్యాణం.. కమనీయం.. | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం..

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

కల్యా

కల్యాణం.. కమనీయం..

మంగపేట: మండలంలోని కమలాపురం బిల్ట్‌ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తుల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పూజారి ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు వేదమంత్రోశ్ఛరణ నడుమ దేవతామూర్తుల విగ్రహాలను మంగళవాయిధ్యాలతో కల్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. భక్తులు స్వామివారికి, అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు పూజారులు వేద మంత్రోశ్ఛరణ నడుమ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

కల్యాణం.. కమనీయం..1
1/1

కల్యాణం.. కమనీయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement