పోలీస్ క్రీడా పోటీల్లో ‘బెటాలియన్’కు పతకాలు
గోవిందరావుపేట: తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 5వ బెటాలియన్ సిబ్బంది ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో మొత్తం 40 పతకాలతో ముందంజలో ఉన్నారు. బెటాలి యన్‌కు చెందిన పిసి–1,440 డి.కల్యాణ్ ఈత (స్విమ్మింగ్) పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి 5 బంగా రు పతకాలు సాధించగా మరో పి.సి1,268 బి.హనుమంతు కరాటే విభాగంలో వ్యక్తిగతంగా 5 పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయాన్ని పురస్కరించుకొని బెటాలియన్ అదనపు కమాండెంట్ బి. సీతారాం శుక్రవారం సిబ్బందిని అభినందించారు. వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ ప్రశంసనీయమన్నారు. క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, భవిష్యత్‌లో కూడా ఇలాగే ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్ కుమార్, శ్రీనివాస్ రావు, ఆర్‌ఐలు వెంకటేశ్వర్లు, సాయి బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.


