84 మంది గైర్హాజరు
● కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
ఏటూరునాగారం: జిల్లాలో పది మండలాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయని, ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి నాయిని విరేందర్ తెలిపారు. శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష కావడంతో జిల్లాలోని 2,006 మందికి 1,922 మంది హాజరు కాగా 84 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష గదిలోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నేడు (శనివారం) ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ఉందని, విద్యార్థులు సకాలంలో హాజరు కావాలన్నారు.


