పంచాయతీలకు నిధులు
మండలాల వారీగా
నిధులు (రూపాయల్లో)
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం
● జిల్లాలో 171 జీపీలకు
కేటాయింపు
● పంచాయతీ ఖాతాల్లో
రూ.5.49 కోట్లు జమ
ములుగు: రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖాజానాలకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అభివృద్ధి కుంటుపడింది. పారిశుద్ధ్య పనుల నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు, చెత్తాచెదారాన్ని తరలించే ట్రాక్టర్లకు సైతం డీజిల్ పోసేందుకు అప్పులు చేసి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీల భారాన్ని తమ మీద వేసుకొని కొంతమేర నెట్టుకువచ్చినప్పటికీ పంచాయతీల అభివృద్ధిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలోని 171 గ్రామపంచాయతీ ఖాతాల్లో రూ.5.49.73.162 లను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థికసంఘం నిధులను జమచేసింది. ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.150ల చొప్పున కేటాయిస్తుండగా ఎస్సీ, ఎస్టీ జనాభాకు 10 నుంచి 20 శాతం అదనంగా నిధులను కేటాయిస్తుంది. రేండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎస్‌డీఎఫ్ గ్రాంట్ ఇప్పటివరకు మంజూరు కాలేదు. కేంద్రం 2023–24 సంవత్సరానికి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసినప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులను మంజూరు చేయాల్సి ఉంది.
కేంద్రం మంజూరు చేసిన నిధులను తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఈ నిధులతో తాగునీరు, పైపులైన్ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ, చెత్తాచెదారాన్ని తరలింపు, నిర్వహణ కేంద్రాలకు 60 శాతం నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా, సీసీ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, పంచాయతీ భవనాల మరమ్మతు, శ్మశాన వాటికల సదుపాయాలకు 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు మంజూరైన నిధులను పాలకవర్గాలు ఖర్చు చేస్తేనే మిగిలిన నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఏటూరునాగారం 61,64,495
గోవిందరావుపేట 58,54,016
కన్నాయిగూడెం 24,14,646
మంగపేట 90,29,476
ములుగు 85,68,649
తాడ్వాయి 48,87,273
వెంకటాపురం(ఎం) 63,79,108
వెంకటాపురం(కె) 66,03,853
వాజేడు 54,36,416
మొత్తం 5,49,73,162
గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులతో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామంలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ద్య నిర్వహణకు ప్రాధాన్యం కల్పిస్తాం, మిగిలిన నిధులతో ప్రజల అవసరాన్ని బట్టి వినియోగిస్తాం.
– మామిడిశెట్టి సుగుణ, సర్పంచ్, వెంకటాపురం
పంచాయతీలకు నిధులు
పంచాయతీలకు నిధులు


