పుష్కరఘాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మంగపేట/ఏటూరునాగారం: గోదావరి పుష్కరఘాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగపేట మండలంలో నూతనంగా పుష్కరఘాట్ నిర్మాణం చేపట్టేందుకు మల్లూరు, చుంచుపల్లి, మంగపేటలోని పొదుమూరు, గంపోనిగూడెం సమీపంలోని సండ్రోనిఒర్రె ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతాన్ని కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ (రెవెన్యూ)తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముల్లెకట్టలో 2015లో నిర్మించిన పుష్కరఘాట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంగపేట మండలంలో నూతన పుష్కరఘాట్ నిర్మాణంపై ఇరిగేషన్ డీఈ రవికుమార్, ప్రవీణ్‌కుమార్‌తో చర్చించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా ప్రతీ ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, రవాణామార్గం, పార్కింగ్ స్థలాలు, ప్రత్యేక వైద్యశిబిరాలు కల్పించడానికి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ తోట రవీందర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి, ఎంపీడీఓ బద్రునాయక్, ఇరిగేషన్ డీఈ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్‌రావు, ఆర్‌ఐ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, రూప్‌సింగ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర


