‘ఉద్యమ్‌’తో సబ్సిడీ రుణాలు | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యమ్‌’తో సబ్సిడీ రుణాలు

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

‘ఉద్యమ్‌’తో సబ్సిడీ రుణాలు

‘ఉద్యమ్‌’తో సబ్సిడీ రుణాలు

ములుగు: ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యువత వ్యాపార రంగాలపై ఆసక్తి ఉన్న వారు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా స బ్సిడీ రుణాలు పొందాలంటే ఉద్యమ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసుకుని ఉండాలన్నారు. సదస్సులో ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రాముఖ్యత, ఎలిజిబిలిటీ ప్రమాణాలు, ఆన్‌లైన్‌ అప్లై చేసే విధానం, లాభాలు (లోన్లు, సబ్సిడీలు, ప్రాధాన్యత టెండర్లు మొదలైనవి) వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రభుత్వం నుంచి సమగ్ర సాయం పొందడం, బ్యాంకు లోన్లు, సబ్సిడీలు, టెండర్‌లో ప్రాధాన్యం వంటి ప్రయోజనాల కోసం సరైన దశలో ఉద్యమ్‌ రి జిస్ట్రేషన్‌ సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, ఈడీసీ మేనేజర్‌ విక్రమ్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ భుక్య శ్రీకాంత్‌, ఆర్‌పీ వెంకన్న, రామేందర్‌, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సిద్ధార్థరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement