నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

ఏటూరునాగారం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యమని సీజీఎం రాజీవ్‌ చౌహన్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలను నాటి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, ప్రజలకు నాణ్యతమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు నూతనంగా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. రైతులకు త్రీఫేజ్‌ సరఫరా ఉంటుందని వెళ్లడించారు. విని యోగదారులు విద్యుత్‌ను వృథా చేయకుండా పవర్‌ను సేవ్‌ చేయాలన్నారు. నిర్లక్ష్యంగా విద్యుత్‌ వైర్ల ను నిర్మించకుండా శాశ్వతంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే అధికారులు, సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఆనందం, డీఈఈ నాగేశ్వర్‌రావు, డీఈఈ పురుషోత్తం, టీఆర్‌ఈ డీఈఈ సదానందం, టీఆర్‌ ఏడీ మధుసూదన్‌, ఏఈ స్వామి, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కొండా స మ్మయ్య, లైన్‌మెన్‌లు, జేఎల్‌ఎంలు పాల్గొన్నారు.

సీజీఎం రాజీవ్‌ చౌహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement