తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు

Feb 21 2026 6:55 AM | Updated on Feb 21 2026 6:55 AM

తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు

తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు

తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు

వెంకటాపురం(కె): రానున్న వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పాత్రాపురం గ్రామంలోని రైతువేదికలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సర్పంచ్‌లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనందున వాటిని గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపటాలన్నారు. ఈనెల 21 నుంచి వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల సర్పంచ్‌లకు తాడ్వాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ శిక్షణ తరగతులకు సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి వెంకయ్య, ఎంపీడీఓ జుమ్మిలాల్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

పుష్కరఘాట్‌ పరిశీలన

మండల పరిధిలోని అంకన్నగూడెం గ్రామ సమీపంలోని గోదావరి ఒడ్డున ఉన్న పుష్కరఘాట్‌ ను అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు శుక్రవారం పరిశీలించారు. వచ్చేఏడాది జూన్‌లో వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీఓ జుమ్మిలాల్‌, సీఐ ముత్యం రమేష్‌, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాసరావు ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement